అభ్యంగనము వలన వాత, కఫ దోషాలు హరించును. శారీరక బడలికను పోగొట్టి.. బలాన్ని కలిగిస్తుంది. దేహకాంతి, మంచి కంటి చూపు, సుఖ నిద్రను కలిగిస్తుంది. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. ప్రతిరోజూ చెవులలో కొద్దిగా తైలపు చుక్కలు వేసుకోవడం వలన చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శద్ధగ్రహణం బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
శిరస్సు మీద నూనె మర్దనా చేయడం వలన మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళులు, చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగము వలన తైలం రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురుకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధి చేస్తుంది. వివిధ రకాల జ్వరములతో బాధపడేవారు, అజీర్ణవ్యాధులతో బాధపడేవారు, విరేచనములగుటకు ఔషదం తీసుకున్నవారు తైలంతో అభ్యంగము చేయకూడదు.
సాధారణంగా ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులలో స్నానం కూడా ఎంతో ప్రత్యేకంగా చేస్తారు.స్నానం చేయటం గురించి ప్రత్యేకంగా వస్తు గుణ దీపికలో తలంటు స్నానం గురించి ఎంతో చక్కగా వివరించబడింది.
ముఖ్యంగా పండుగల సమయంలో అనగా సంక్రాంతి వంటి పండుగ రోజులలో తలస్నానానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని పిలుస్తారు.
ఈ అభ్యంగన స్నానం కోసం కొబ్బరి నూనె ,ఆవ నూనె, నువ్వుల నూనెను ఉపయోగిస్తారు.ముందుగా అభ్యంగన స్నానం చేయడానికి నూనెలలో ఏదైనా ఒక దానిని ఉపయోగించి శరీరం మొత్తం బాగా రాసి మర్దన చేయాలి.
ఈ విధంగా అభ్యంగన స్నానం వారంలో కనీసం ఒకరోజు అయినా చేయడం వల్ల శరీర వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని మన పెద్దవారు చెప్తుంటారు.
0 Comments