అర్జునుడి చరిత్ర
అర్జునుడు పాండవ మధ్యముడు. మహాభారత ఇతిహాసములో ఇంద్రుడి అంశ మరియు అస్త్రవిద్యలో తిరుగులేని
వీరుడు. పాండు రాజు సంతానం. కుంతికి ఇంద్రుడుకి కలిగిన సంతానం.
జననం:
జననం:
పాండు రాజుకు మొదటి భార్యయైన కుంతీ దేవి ద్వారా సంతానం కలుగలేదు. కుంతీ దేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది. ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది. కుంతీ దేవి మొదట యమ ధర్మరాజును ప్రార్థించింది. యుధిష్టురుడు జన్మించాడు. వాయుదేవుని ప్రార్థించింది; భీముడు జన్మించాడు. చివరగా దేవేంద్రుని ప్రార్థించింది. అర్జునుడు జన్మించాడు.అలాగె కుంతి మాద్రీ దేవికి ఆ మంత్రం ఉపదేశించి ఒక్కసారిమాత్రమే ఇది పనిచేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకొమ్మనగా ఆవిడ తెలివిగా ఒకే మంత్రానికి ఇద్దరు జన్మించేలా దేవవైద్యులైన అశ్వినీ దేవతలను ప్రార్థంచి ఇద్దరు పిల్లలను పొందింది. ఇలా పంచపాండవుల జననం జరిగింది.
ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు." ధర్మరాజా! నీ
మనస్సులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే
విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునకు ఉపదేశించు. దాని ప్రభావంతో
అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తారు.
మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి " అని చెప్పాడు . వ్యాసుని ఆజ్ఞ
ప్రకారం పాండవులు కామ్యక వ నానికి వెళ్ళారు. ధర్మరాజు ఒకరోజు అర్జునినితో "
అర్జునా ! భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని
గెలవాలంటే మనకూ దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి
మంత్రోపదేశం చేసాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నీవు తపస్సు చేసి
దివ్యాస్త్రాలు సంపాదించు. వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమతమ అస్త్రాలను ఇంద్రునికి
ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమ శివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని
వ్యాసుడు ఆదేశించాడు " అని చెప్పి అర్జునునకు వ్యాసుడు ఉపదేశించిన
ప్రతిస్మృతి అవే విద్యను ఉపదేశం చేసాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు
చేయడానికి గంధ మాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునిని
చూసి " వీరుడా నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంతస్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే
ప్రదేశం. ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని ? నీ ఆయుధములు విడిచి పెట్టు " అన్నాడు. ఆ
మాటలకు చలించకుండా స్థిరంగా ఉన్న అర్జునిని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో
ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమైయ్యాడు. " అర్జునా నీ ధైర్యానికి
మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో " అని అన్నాడు. అర్జునుడు " నాకు
దివ్యాస్త్రాలు కావాలి " అన్నాడు. ఇంద్రుడు " ఎలాగూ అవి లభిస్తాయి.
అమరత్వం కావాలా?
" అని అడిగాడు. అర్జునుడు " ముందు నాకు
దివ్యాస్త్ర సంపద కావాలి. అవి నాకు ప్రసాదించండి " అన్నాడు. ఇంద్రుడు "
అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి " అన్నాడు.
వెంటనే అర్జునుడు ఇంద్రకిలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి
ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుడుని పరీక్షించదలిచాడు. ఒక
కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు
అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు.
అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు
తగలగానే ఆపంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో " నేను కొట్టిన
జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం
నీకు తెలియదా " అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు
కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా ? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా "
అన్నాడు శివుడు.
అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ
లేదు. అర్జుననకు ఆశ్చర్యం వేసింది " ఇతను సామాన్యుడు కాదు దేవేంద్రుడైనా పరమ
శివుడైనా అయి ఉండాలి " అని కున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను
బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి " అని మనసులో అనుకున్నాడు.
మరల బాణం వేయడానికి గాండీవం తీసుకున్నాడు. అతని చేతిలోని గాడీవం అదృశ్యం అయింది.
ఇక ఇరువురు ద్వంద యుద్దానుకి దిగారు. శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు
మూర్చబోయాడు. శివుడు తన నిజ రూపం ధరించాడు. అర్జునుడు కైమోడ్చి శివునకు
నమస్కరిస్తూ అనేక విధాల స్థితించాడు. " పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి
నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు " అన్నాడు. అందుకు శివుడు "
అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు
అనే దేవఋషివి . ఇదిగో నీ గాడీవం .ఇంకా ఎదైనా వరం కోరుకో " అన్నాడు. అర్జునుడు
" త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి
అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు " అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి
అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం , సంధానం, మోక్షణము,
సంహారం సహితంగా అర్జునుడికి
ఉపదేశించాడు.శివుడు అర్జునుడితో " అర్జునా! ఈ పాశుపతాన్ని అల్పులపై
ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను
జయిస్తావు " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. పరమశివుని చూసినందుకు అర్జునుడు
సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఈ
విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు
వచ్చాడు. " అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము
" అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు
వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం
చేసారు. అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు.
దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు
అర్జునుడు కొలువులో ప్రవేశించుట:
అర్జునుడు అందమైన చీరె కట్టుతో, రవికతో, చక్కని తలకట్టుతో ఆడవేషంలో విరాటుని
కొలువులో ప్రవేశించాడు. అర్జునినిలో నపుంసకత్వం ఆడతనం మూర్తీభవిస్తున్నాయి.
విరాటుని చూసి " మహారాజా! నా పేరు బృహన్నల. నేను పేడి వాడిని. ఆడపిల్లలకు ఆట
పాట నేర్పుతాను. నన్ను మీ కొలువులో చేర్చుకోండి " అన్నాడు. విరాటరాజు "
అయ్యో ఇంత అందమైన నీకు పేడి రూపమా " అడిగాడు. అర్జునుడు " ఔను మహారాజా!
శాపవశాన పేడితనం ప్రాప్తించింది. పేడి తనం వలన ఏ పని చేయలేను. సంగీతం, నృత్యం నేర్చుకున్నాను, అన్ని రకముల వాద్యాలను వాయించ గలను.
అలంకార కళలో ప్రవేశం ఉంది " అన్నాడు. అతడి పేడి రూపంలో ఏమీ దోషం లేదని
గ్రహించి ఉత్తరను కొలువుకు రప్పించాడు. మందగమన ఉత్తర కొలువుకూటమికి వచ్చింది.
విరాటరాజు " బృహన్నలా ! ఈమె నా కూతురు ఉత్తర. ఈమెకు
నాట్యం నేర్పగలవా " అన్నాడు. బృహన్నల వినయంగా నేర్పుతాను అన్నాడు. విరాటరాజు
" బృహన్నలా! నా కూతురు ఇంకా చిన్న పిల్ల. ఆట పాటల మీద మక్కువ ఇంకా పోలేదు.
నీవు ఆమెకు కళల యందు ఆసక్తిని కలిగించి నాట్యంలో శిక్షణ ఇవ్వవలసిన బాధ్యత నీదే.
నీవు ఈమెకు రక్షికుడిగా ఉండాలి " అని ఉత్తరను చూసి " అమ్మా! ఈమె నీ
గురువు ఆమె ఎలా చెపితే అలా భక్తితో నడచుకో " అని బృహన్నలకు ఉత్తరను
అప్పగించాడు. ఆ విధంగా అర్జునుడు విరాటుని కొలువులో ప్రవేశించాడు.
అర్జునుడికి గల పేర్లు:
1. పార్థుడు
2. జిష్ణు
3. కిరీటి
4. విజయుడు
5. కపిధ్వజుడు
6. సవ్యసాచి
7. బీభత్సుడు
8. ఫల్గుణుడు
9. ధనంజయుడు
10. గాండీవాదారి
11. శ్వేతవాహనుడు
12. గూడకేశుడు
1 Comments
చాల బాగుండి అర్జునుడు మహాభారతం లోని మహావీరుడు అర్జునుడు మహాభారతంలో నాకు ఇష్టమయిన పాత్ర
ReplyDelete