ద్వారక

జలగర్భంలో ద్వారక



          కోట్ల సంవత్సరాల భారతీయ నాగరికత ఆనవాళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. భారతీయ గ్రంథాలు వాటికి సాక్ష్యాలు చూపుతున్నా, మెకాలే వారసులైన చరిత్రకారులు మనది ‘సంస్కృతి హీనమైన’ దేశంగా చిత్రీకరించారు. కాలగమనంలో అనేక నిజాలు బయట పడుతున్నాయి. వాటిని వెలుగులోకి తేవటం ఈ శీర్షిక ఉద్దేశం.
           శ్రీకృష్ణుని అనతి మేరకు దేవశిల్చి విశ్వకర్మ  నిర్మించిన అద్భుత నగరం ద్వారక. పరమాత్మ నడయాడిన పరమపావన మోక్షధామం. నాటి పురాణగాథలు ప్రత్యక్ష సత్యాలని నేటి అంతరిక్ష పరిశోధనల, నిష్పాక్షిక చారిత్రక పరిశీలనలలో నిగ్గు తేలినవి. ఆ ద్వారకా నగరి విశిష్టతని పరిశీలిద్దాం!
            అధునాతన నాగరికతకు ప్రాణ భిక్ష పెట్టిన ఒకానొకనాటి సనాతన సంస్కృతి ఎక్కడో సముద్రపు అట్టడుగున శిలలూ శిల్పాల రూపంలో పడివుంటే దాన్ని వెలికి తీయడం హర్షణీయం!
అదే ఐదు వేల యేళ్ల క్రితం నాటి ద్వారక!
           వాల్మీకి వ్యాసాదుల పుణ్యమా అని మన కంటూ ఒక చరిత్ర ఉంది. విశ్వమంతా చాటేందుకు మనకి అనేక కావ్యాలు,పురాణ కధలున్నాయి.
            కొట్టి పారేసే బుద్ధి లేనంత వరకూ, రానంత వరకూ ప్రతి మహాకావ్యం ఒక విజ్ఞాన సర్వస్వం! ఒక భూతకాల అనుభవం, ఒక వర్తమాన చైతన్యం, భవిష్యత్కాలానికి ఒక హెచ్చరిక! వీటి ఆధారాలతో మన సంస్కృతిని మరల మరల బ్రతికించు కోవాలి. ఈ దిశగా మన సంస్కృతి సంరక్షణ కోసం తమ విజ్ఞానశాస్త్రం అనుభవాన్ని జోడించిన మేధావులెం దరో మనలో ఉన్నారు.
ద్వారక మునిగిపోయింది. ఏ సముద్రమైతే దారి చూపిందో అదే సముద్రం ఉప్పొంగి ద్వారకను కబళించింది.
        కలియుగం ప్రారంభం కానున్నదని కృష్ణుడు హెచ్చరిస్తూనే కన్ను మూసాడు. యాదవుల రక్షణకోసం తాను ప్రత్యేకించి నిర్మించిన ఆ మహానగరం నుంచి తక్షణం నిష్ర్కమించమని యాదవులందర్ని ఊరడించి తనువు చాలించాడు శ్రీకృష్ణుడు!

ఇంతకీ యాదవులకు ఎవరినుంచి రక్షణ కావాలి?


      దుష్టుడైన కంసమామను సంహరిస్తే, మామకు మామ జరాసంధుడు, పగబట్టి పలుమార్లు వాసుదేవుడి పైకి దండ యాత్ర చేశాడు.యాదవుల సంఖ్య తగ్గిపోతుంటే… వారిని రక్షించి తగిన సమయం
       చూసుకుని జరాసంధుణ్ని అతన్ని అనుచరుడు కాలయవనుణి సంహరించాలని పడమట దిశగా పయనించాడు. సౌరాష్ట్ర తటాన విశ్వకర్మ, సముద్ర దేవుని ఆమోద ముద్రకోసం, అతణ్ని పూజించమన్నాడు.
      శ్రీకృష్ణుడి పూజకు సముద్రుడు ప్రసన్నుడై 12 యోజనాల ‘భూభా గాన్ని’ వేరు చేసి  ఇచ్చాడు. అక్కడే వెలసింది స్వర్ణ నగరం ద్వారక! కనుకనే ద్వారకకి స్వర్ణపురి, స్వర్ణ ద్వారిక అనే పేర్లు ఉన్నాయి.
మధుర నుంచి ద్వారకకు ఆ విధంగా శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని తరలించాడు.
          సాగర మథనం జరిగితే అమృతం పుట్టినట్లు, సాగర అన్వేషణ జరిపితే సంస్కృతికి ఆనవాళ్ళు దొరుకుతాయి. అటువంటి ప్రయత్నం గోవాలోని ఎన్నైవా (సాగర విజ్ఞాన సంస్థ) లోని ‘మెరయిన్ ఆర్కియాలిజీ’ విభాగం చేపట్టింది, దాదాపు పాతికేళ్ళక్రితం! – అరబ్ సాగరంలో కలిసే గోమతీ నదీ తటాన ద్వారక ఉండేది. ఇప్పటి ద్వారకకి ఉత్తరాన బేట ద్వారక (బేట=దీవి), దక్షిణాన ఓఖామండి, తూర్పున పిందార ఉన్నాయి. ద్వారకకూ, బేట ద్వారకకూ ఒక సేతు నిర్మాణం గుజరాతు ప్రభుత్వం తల పెడుతున్నందుకు హర్షించాలి. చతుర్ధామాలలో ఒకటి ద్వారక, ద్వారకాధీశుడు కొలువున్న ఈ ద్వారకా మందిరం 2500 సంవత్సరముల ప్రాచీనమైంది. ఇక్కడనే ఆది శంకరులు ప్రతిష్టించిన శ్రీ శారదాపీఠం కూడ ఉంది. ద్వారక నుంచి 35 కి.మీ. దూరంలో బేట ద్వారక ఉంది. వీటి మధ్య నావల రాకపోకలున్నాయి. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి 1981లో ద్వారకను సందర్శించి సముద్రాన్వేషణకు నిధులు సమకూర్చారు. సముదంలోతుల్లో ఈత గాళ్లను స్కూబాడైవర్స్’ అంటారు. ఒక్కొక్క స్కూబాదళం ఒక చదరపు కిలోమీటరు స్థలాన్ని అన్వేషించడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. 1983-87 సంవత్సరాల మధ్య మొదటి విడత, 1988-1990 సం||ల మధ్య రెండవ విడత అన్వేషణలు ప్రారంభ మయ్యాయి.
శ్రీ ఎస్.ఆర్.రావు నేతృత్వంలో జరిగిన అన్వేషణలో బయల్పడిన వాస్తవాలు చీకటికాలానికి తెరపడేలా చేసాయి.
       బుధుడు పుట్టడానికి పూర్వం పన్నెండు వందల ఏళ్ళ పాటు అంతా ‘చీకటికాలం’ అని పాశ్చాత్యులు ముద్ర వేశారు. కాని ద్వారక ఏం చెబుతోంది? చరిత్రకారులు నిజాలు దాచే స్తారు. చరిత్రను తిరిగి రాయడమంటే తమ విశ్వాసాన్ని బలి చేయడమే అని వారు కదలిరారు.
       ఎనిమిది సంవత్సరాల కాలంలో 12 సార్లు అన్వేషణ సాగింది. లభించిన ఆధారాలకు శాస్త్రీయ పరీక్షలు జరిగాయి. గ్రంథాల్లో పేర్కొన్న వేవీ ఊహా జనితాలు కావని స్పష్టమైంది. ద్వారకా నగరంలో ఎత్తైన ప్రహరీ గోడలు ఇటు ‘పొంగే’ సముద్రం నుండి రక్షణ నిమిత్తమైనవో లేక పొంచి ఉండే జరాసంధుడి నుండి రక్షణార్ధమో అన్నట్టు ఉన్నాయి. అటువంటి దిట్టమైన గోడల ఉనికి దొరికింది. అంతేకాదు అసలు సిసలు రేవు అది అని చెప్పేందుకు అనేక ఆధారాలు లభించాయి. కుమ్మరి కళ, కలప వినియోగం, చక్కటి గోళా కారపు రంధ్రాలు, శిల్పకళ ఏదీ తీసిపోనంత అద్భుతంగా ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా ద్వారక ఆరు విభాగాలుగా నిర్మిత మైనట్లు కనుగొన్నారు.

  • గ్రీకు రాయబారి మెగస్థనీస్ (క్రీ.పూ. 4వ శతాబ్దం, చంద్ర గుప్త మౌర్యుని కాలం) సౌరసేనుల హయాంలో రెండు మహా నగరాలున్నాయని ప్రస్తావించాడు. అవి -1. మథుర, 2. కృష్ణపుర (ప్రజ, బృందావనం)
  • గ్రీకు రాయబారి హెలియోడోరస్ గొప్ప విష్ణు భక్తుడు. కృష్ణుడు ‘దేవదేవుడని’ కొనియాడాడు. మధ్య ప్రదేశ్లో ఉత్తర దిశలోని ‘విదేశ’లో క్రీ.పూ.113/140-150ల కాలంలో ఒక గరుడ స్ధూపం నెలకొల్పాడు. ఇది ఇప్పటికీ ఉంది.
  • ‘సముద్ర ఉపరితల పెరుగుదల’ (సీ లెవల్ రైజ్) యదార్థం కదా, ద్వారక ఆ రకంగా మునిగి పోయి ఉండాలి.
  • భూమి తనలో తాను తిరుగుతుంది కదా. అక్షం ఒరుగుతూ ఉంటుంది. దీని వల్ల ప్రపంచం నలుమూలలా
  • మార్పులు అనివార్య మవుతాయి. క్రీ.పూ. 3000 సంవత్సరముల క్రితం ద్వారకకు ఇటు వంటి ఉపద్రవం సంభవించి ఉండవచ్చని కొందరి అంచనా! ‘రావణ లంక’ కూడా ఇలానే మునిగి పోయిందంటారు.
  • నేటి ద్వారకాధీశ మందిరంలో ధ్వజం 52 గజాల పొడవైనది. విశేషమేమిటంటే 52 చిన్న జెండాలు ఈ ధ్వజం అంచున ఒకదానికొకటి ముడి వేసుకొని ఉంటాయి. బలరామ, శ్రీకృష్ణ, ప్రద్యుమ్న, అనిరుద్దులు-ఈ నలుగురు అగ్రగణ్యులు. వీరిని మినహాయిస్తే 52 మంది పాలకులకీ ఒక్కొక్క గజం ప్రతీక!.
ద్వారకలో ప్రవేశ ద్వారం స్వర్గ ద్వారం అయితే, బయలు ద్వారం మోక్ష ద్వారం-ఈ రెండు కాక మరో 50 ద్వారాలున్నాయని హరి వంశ కథనం, వెరసి 52 ద్వారాలకి ప్రతీకలీ 52 గజాలని అంటారు.
        ద్వారక సముద్రం నీట మునిగినది. కలియుగ ప్రారంభం క్రీ||పూ|| 3102 లో అని మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పారు. కనుక ఈ ఘటన జరిగింది 5,000 సం||ల క్రితం అన్నమాట!
దీనికి ఆధారంగా నాసా శాటిలైట్ చిత్రాల ద్వారా పరిశోధించి క్రీపూ 3000సంవత్సరాలకు పూర్వం ద్వారకా నగరం నీట మునిగినట్లు ఋజువు చేశారు.
నాటి ద్వారకను కుశస్థలి, ద్వారవతి అనే వారు.
           నేటి ద్వారకలోని ద్వారకానాధ్ మందిరాన్ని శ్రీ కృష్ణుని ముని మనవడు వజ్రనాభుడు నిర్మించాడని, అదీ ఒక్క రాత్రిలోనే అనీ ప్రతీతి! త్రిలోక సుందర మందిరమని దీనికి పేరు. జగత్ మందిర మనీ కూడా అంటారు. ఈ మందిరం నిర్మాణం బహుశః 2500ఏళ్ళ క్రితం జరిగి ఉండాలి.
      అయిదంతస్థుల మందిరమిది, ఎత్తు 157 అడుగులు, కొత్తగా నిర్మించిన హాల్ ల్లో 60 స్తంభాలున్నాయి. ఈ ప్రధాన మందిరానికి 2 కి.మీ.ల దూరంలో ‘రుక్మిణీ దేవి’ మందిరముంది.
శ్రీమహావిష్ణువు శంఖాసురుణ్ని సంహరించిన శంఖోద్ధర దీవి-ద్వారక నుంచి 32 కి.మీ.ల దూరం లో ఉంది. ఇదే శ్రీకృష్ణుడు వాసమున్న ద్వారకాదీవి (బేటద్వారక). దీనికి రమణదీ(ద్వీ)పమని పేరుంది.
        బేట ద్వారకకు దగ్గర్లోనే ప్రాచీన ‘గోపి కొలను’ ఉంది (ద్వారక నుంచి 14 కి.మీ. దూరం) ఆ వైపే ‘ద్వారకా వనం’ ఉంది. ఇక్కడ ‘నాగ నాథుడు’గా శివ మందిరముంది. నాగేశ్వర మహదేవ మందిరం జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి.
        నాటి ద్వారకలో ‘పసుపువన్నె’ కాంతుల్లా నేడూ ఈ పరిసర ప్రాంతాల మట్టి పసుపు రంగులో ఉంటుంది. దొరికిన ఆధారాలు నిజాలు కావనిలౌకిక ప్రభుత్వాలు శతవిధాల ఋజువు చేయడానికి ప్రయత్నించవచ్చు.
చరిత్ర అంగీకరించినా, అంగీకరించక పోయినా శ్రీకృష్ణుడు అవతరించి ద్వారకను నిర్మించాడన్నది అక్షర సత్యం!

సముద్రంలో కొన్ని మీటర్ల దిగువన లభ్యమైన కొన్ని సాక్ష్యాధారాలు

  1. రాగి గుడి గంట
  2. శిలపై మలచ బడ్డ పాదాలు (పైన శిలాకృతి అలభ్యం)
  3. మత్సావతార రూపంలో శ్రీమహావిష్ణువు శిల్పం (మత్స్యభాగం అలభ్యం)
  4. పొడవాటి గోడ
  5. వర్తులాకారంలో కర్ర దిమ్మలు
  6. వర్తులాకార రంధ్రాలున్న ఫలకాలు
  7. ఒక ముద్ర-నంది, మేక వంటి జంతువులున్నాయి.
  8. ముఖద్వారాలు, మెట్లు, గోమతి నది ఆనవాళ్లు
  9. త్రికోణాకృతిలో నావలను నిలిపే సాధనాలు (100-140 కిలో గ్రాముల బరువైనవి)
  10. అర్ధవృత్తాకారపు రాళ్లు, మధ్య రంధ్రాలు.
  11. ఒకే వరుసలో ఉన్న ప్రిజమ్” ఆకృతులు, వాటిపైన కూడా మూడేసి రంధ్రాలు.
  12. ఆరు క్షేత్రాలు
  13. కుమ్మరి కళాకృతులు
  14. సప్తదీవుల ఉనికి
taken from:hariom


Post a Comment

1 Comments