మహాశివరాత్రి

మహాశివరాత్రి

మహాశివరాత్రి ఒక హిందువుల పండుగదేవుడు శివుడుని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారుఇది శివదేవేరి పార్వతి వివాహం జరిగిన రోజుమహా శివరాత్రి పండుగను 'శివరాత్రిఅని కూడా ప్రముఖంగా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రిసివరాత్రిశైవరాతిరిశైవవరాత్రిమరియు శివరాతిరి అని కూడా పలుకుతారుమరికొందరు 'శివుడి యొక్క మహారాత్రి', అని లేదా శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు.

సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున "శివరాత్రివస్తూనే ఉంటుందిదీనిని "మాసశివరాత్రిఅంటారు రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేయిస్తూ ఉంటారుఅందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే "మహాశివరాత్రిపర్వదినం చాలా విశిష్టమైనదని పండితులు అంటున్నారుఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి ఆడుగుతుందిఅప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇషటమనీఇంకేమి చేయకుండా  రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడుఆయన చెప్పిన దాని ప్రకారం రోజు పగలంతా నియమ నిష్ఠతో ఉపవాసంతో గడిపిరాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతోతర్వాత పెరుగుతో తర్వాత నేతితో తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుందిమరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలిదీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.

మామూలుగానైతే  మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారుకానీఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుందిఅందుకే శివరాత్రిని  రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారుమహాశివుడంటే అందరికి తెలుసుకానిరాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. "రాఅన్నది దానార్థక ధాతు నుండి "రాత్రిఅయిందంటారుసుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారుఋగ్వేద - రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది - హే రాత్రేఅక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక
"మహాశివరాత్రిపర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచిశుచిగా తలస్నానం చేసిపూజా మందిరమునుఇంటిని శుభ్రం చేసుకోవాలిగుమ్మానికి తోరణాలుపూజామందిరాన్ని ముగ్గులురకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలితెలుపు రంగు బట్టలను ధరించిశివుని పటాలులింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలిమారేడు దళములుతెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించిపొంగలిబూరెలుగారెలుఅరటిజామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలిపూజా సమయంలో శివఅష్టోత్తరముశివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలుమోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారుఅదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామముశివ పురాణముశివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయిశివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచిమరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు






శివరాత్రి ఉపవాసం, జాగారం.. పాటించాల్సిన నియమాలు





వేదాల్లో రుగ్వేదం చాలా గొప్పదిఇందులోని రుద్రం ఇంకా గొప్పదిపంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరింత గొప్పవిశివ అంటే మంగళకరమని అర్థంపరమ మంగళకరమైనది శివస్వరూపం పరమ శివుడి అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రిదేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటిమాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయిలింగోద్భవం జరిగిన రోజే మహాశిరాత్రిగా జరుపుకుంటారుశివుడి పండుగల్లో ఇది ప్రధానమైంది.

    

ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచమహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ట చేసినాశివపార్వతుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టంమహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థంచేసుకోవచ్చుత్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలిఅష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.
        

ఎంతో పవిత్రమైన  రోజున శివుణ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారుశివపురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడుకి ఉపమన్యు మహర్షి వివరించాడు రోజున పరమేశ్వరుణ్ని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారుఅవి.. శివపూజఉపవాసంజాగారంవీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉందిమహాశివరాత్రినాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదుఉపవాసం వల్ల శారీరక శుద్ధిజాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి.
                        

ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారుఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలిశివధ్యానం చేస్తే శివానందం కలుగుతుందిశంకరుని అనుగ్రహం లభిస్తుందిశివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలిమేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి.
        

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారుశివుడు కూడా తన భక్తుల ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడుకాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడేవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదుఅల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి కాలంలో దొరికే అనాసద్రాక్షజామ వంటి పళ్లను తీసుకోవచ్చని చెపుతున్నారు.


కాబట్టి ఎంతో నియమ నిష్టలతో ఉపవాసం ఉండిమహాదేవుణ్ని ధ్యానించాలివాస్తవానికి మహాశివరాత్రినాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదటకానీకాలంలో బీపీమధుమేహం లాంటి వ్యాధులు చాలా మందిని బాధిస్తుండంతో కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారుఇలా చేయడం అపచారమే అయినా తప్పదు.


Post a Comment

0 Comments