Blessings of Tanot Mata on Indian Army

పాకిస్తాన్ , శక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వందల బాంబుల కురిపించింది తుస్సుమన్నాయి, 90 యుద్ద ట్యాంకులు ఒక్క అడుగు ముందుకు కదల్లేదు,ఇవి కల్పిత కథలు కాదు -జరిగిన యధార్థ సంఘటనలు పాకిస్తాన్ - భారత్ ను ఆక్రమించాలని కుతంత్రం పన్నింది

1965నాటి సంఘటన ఇది,పాకిస్తాన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి,భారత్ దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు ఎందుకంటే అంతకు మూడేళ్ళ క్రితమే చైనాతో పెద్ద యుద్ధమే జరిగింది, ఇదే అదునుగా భారత్ పై పాకిస్తాన్ 
దండయాత్ర చేసింది , ఆసమయంలో భారత్ దగ్గర ఏమి లేవు ఏమైన ఉన్నాయంటే అవి మనసేనల పరాక్రమం నమ్మకం, ధైర్యం మాత్రమే అయినా పాకిస్తాన్ కుట్రలనుమన సేనలు ధైర్యంగా తిప్పికొట్టాయి.

 రాజస్థాన్ లో పాకిస్తాన్ తో మన సరిహద్దు వంద కిలో మీటర్లకు పైగా ఉంటుంది, అక్కడ జైసల్మేర్ జిల్లాలో 150 కిలోమీటర్ల దూరంలో ఉంది తనోట అనే గ్రామం.

యుద్ధం సమయంలో కాశ్మీర్ పాకిస్తాన్ టార్గెట్ అయినా పక్కా ప్లాన్ ప్రకారం తనోట గ్రామంపై ఎటాక్ చేసింది పాక్ కేవలం ఇక్కడ మాతా తనోట్ దేవి ఆలయం సమీపంలో 400 పైగా బాంబులు పడ్డాయి, వందల బాంబులు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకుల నుంచి వర్శించాయి ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఒక్కటి కూడా పేలలేదు ఒక్క చోట కూడా విధ్వాంసం జరగలేదు,ఒక అదృశ్య శక్తి బాంబులు చేరుకోక ముందే వాటిని నిర్విర్యం చేసింది ,ఇన్ని  బాంబులు నిర్వీర్యం చేయడం మానవులకు తరం కాదని పాక్ సేనలకు మెల్లగా అర్థమయ్యింది, అందుకే యుద్ధ విరామం తర్వాత పాక్ ఆర్మీ కీలక సమావేశం జరిగింది అన్ని బాంబులు పేలక పోవడానికి కారణం తనోట్ మాత అని అర్థమయ్యింది ,ఇదంత దేవీ శక్తి అని పాకిస్తాన్ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది, భహిరంగంగా ఏది ఒప్పుకోని పాక్ జనరల్ ఇక్కడికి వచ్చి ఆమాతను
దర్శించుకున్నారు తమ ఓటమిని అంగీకరించారు.


సైన్స్ కు అందని కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి అనడానికి ఇదొక నిదర్శనం , సరిహద్దుల్లో కాపాల కాస్తు భారతావనిని రక్షించిన దేవీ మహిమ అమోగం,నమ్మినా నమ్మక పోయినా ఆరోజు జరిగింది అద్భుతమే లేకపోతే మరేంటి మన హంటర్ విమానాలు పాక్ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నా,పాకిస్తాన్ సత్తా చూపుతున్నా మానవ ప్రమేయం లేకుండా యుద్ధం ముగియడం నిజంగా ఆశ్చర్యమే కదా , ఈ ఘటన జరిగిన తర్వాత కూడా తనోట మాత శక్తి ప్రదర్శన చేసి మనల్ని శత్రు సేనలనుంచి రక్షించింది అది ఎలాగంటే .తనోట మాత మందిరానికి పది కిలోమీటర్ల దూరంలో తనోట బోర్డర్ ఒౌట్ ఫోస్టు ఉంటుంది, దానికి పది కిలో మీటర్ల ముందు లోంగే వాలా ఏరియా ఉంటుంది యుద్ధం సమయంలో ఈప్రాంతం నుంచి భారత్ లోకి ప్రవేశించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది, 4 డిసెంబర్ రాత్రి పంజాబ్ రెజమెంటుకు చెందిన ఒకే ఒక బెటాలియన్ అక్కడ ఉంది సమయం చూసుకున్న పాక్ మళ్ళీ కుతంత్రం పన్నింది , 2000 మంది పాక్ సైన్యం 90కి పైగా యుద్ధ ట్యాంకులు ,ట్రక్కులు దండెత్తు తున్నారు కానీ అనూహ్యంగ పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి ఎంత ప్రయత్నించినా ఒక్కటి కూడా ముందుకు కదల్లేదు ,దీన్ని అదునుగా తీసుకున్న భారత్ హండర్ విమానాలతో ఆ ట్యాంకులన్నింటిని ధ్వంసం చేసింది, తనోట మాత ఆశీర్వాదంతోనే ఆట్యాంకులన్ని ఆగిపోయాయని మన సైన్యం నమ్ముతుంది, అప్పటినుంచి తనోట మాత మందిరం అద్భుతమేంటో అందరికి అర్ధమయ్యింది, అందుకే BSF జవాన్లు ఎటువంటి కొత్త ఆపరేషన్ మొదలు పెట్టినా ముందు ఇక్కడికి వచ్చి శక్తి మాతా ఆశీర్వాదం తీసుకున్నాకే పనిమొదలు పెడతారు, ఇటువైపు నుంచి వెళ్లే ప్రతి BSF  బెటాలియన్ అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుంది, అత్యంత శక్తిమంతమైనదిగా భావించే ఈ తనోట మాత దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది,1920 కాలంలో ఇక్కడ దేవీ విగ్రహం ప్రతిష్ట జరిగిందని చెబుతారు, పాకిస్తాన్ తో ఈ యుద్ధాలు జరిగిన తర్వాత BSFఏర్పడింది, BSF కు బోర్డర్ ను రక్షించే బాధ్యను అప్ప గించారు అదే సమయంలో ఈదేవాలయ బాగోగులు కూడా BSF కు దక్కాయి, ఈదేవాలయంలో దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా ఇక్కడ పూజలో ఉపొంగుతుంది.


ఈ దేవాలయం దగ్గర ఉన్న మట్టిని కొత్తవాహనాలకు బొట్టు పెట్టి పూజలు నిర్వహిస్తారు, తనోట మాత అద్భుతాలకు సాక్ష్యాలుగా ఆనాటి యుద్ధంలోపేలని పాకిస్తాన్ బాంబుల ప్రతిమలు ఆదేవాలయంలో ఉన్నాయి. మంచుకొండల్లో ఎడారి దారుల్లో నిత్యం దేశం కోసం పోరాడుతున్న ప్రతి వీరజవానుకు ఒకటే నమ్ముతాడు తనోట మాత చల్లని చూపు తమపై ఉన్నంత కాలం ఏ శత్రువు ఏమిచేయలేడని , ఆరెండు యుద్ధాలు గతం ఇవి యుద్ధం తాలుకు గాధలు కావు పచ్చినిజాలు.

🙏🏼Jai Thanote Matha🙏🏼




Source: Ramappa(Kotthapalli) & Border Movie.


Post a Comment

0 Comments