పరమ పవిత్ర దినం ముక్కోటి ఏకాదశి
విష్ణుమూర్తి
ఆరాధకులు పరమ పవిత్రమైన దినంగా పవిత్రమైన దినంగాబావించే రోజిది. నేడు ముక్కోటి
ఏకాదశి! ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. హిందువుల క్యాలెండర్
ప్రకారం ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తూంది. అంటే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం
డిసెంబర్-జనవరి నెలలలో అన్నమాట. “స్వర్గద్వారం”.”ముక్కోటి ఏకాదశి”,”వైకుంఠ ఏకాదశి”
అని పేర్లున్న ఆ పర్వదినాన వైష్ణవాలయాల్లో ఏకాదశిని ఎంతో బ్రాహ్మoడంగ
జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు సర్వాలంకార భుషితుడై వైకుంఠ ఉత్తర ద్వారం వద్దకు
విచ్చేయగా ...ఆక్కడి ఉత్తర ద్వారం వద్ద సకలదేవతలు ఆయనను సేవించిన రోజు కనుక దీనికి
“వైకుంఠ ఏకాదశి” అని పేరు ఏర్పడింది. అందువల్ల ఈ దినం వైష్ణవాలయాల్లో ఉత్తరo వైపున
వున్న వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ ద్వారం నుండి వెళ్లి స్వామివారిని
దర్శించుకోవడం అత్యంత పున్యప్రసదంగా భావింపబడుతుంది. ఈ రోజున
శ్రీమహావిష్ణువుతోపాటూ ముప్పైముడు కోట్ల మంది దేవతలు భూమికి దిగివస్తారని
చెప్తారు. అందువల్లనే దీనికి “ముక్కోటి ఏకాదశి ” అని పేరు తెలుగు రాష్ట్రాలలోని
తిరుపతి ,భద్రాచలం తదితర విష్ణుమూర్తి క్షేత్రలలోను, తమిళనాడు శ్రీరంగంలో ముక్కోటి
ఏకాదశి ఘనంగా జరుపుకుంటారు. ఈనాడు వైకుంఠ ద్వారాలను తెరుస్తారని, దక్షిణాయనంలో
చనిపోయిన పుణ్యాత్ములంతా స్వర్గానికి చేరుకుంటారని ప్రతీతి. ఈ దినం ఏకాదశివ్రతం
చేసి, విష్ణువును పూజించి, ఉపవాస జాగరణలు పాటించడంవల్ల పుణ్యఫలాలు లబిస్తాయి.
ఈరోజు విష్ణుమూర్తి ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు
నిర్వహిస్తారు.
విష్ణుపురాణాన్ని అనుసరించి ముక్కోటి
ఏకాదశి ఒక్కరోజున ఉపవసముంటే హిందువుల క్యాలెండర్ అనుసరించి ఆ సంవత్సరంలో మిగిలిన
22 ఈకదశులలోను ఉపవాసమున్నoత పుణ్యం లబిస్తుంది. ఏకాదశిఅనే రొజూ ఎలా
ఏర్పిడిందో పద్మపురాణం ఇలా వివరిస్తుంది. విష్ణుమూర్తి ముర అనే రాక్షసిని
సంహరించి, ఆమె బారినుండి దేవతలను రక్షిస్తాడు. ప్రశ్చాతాపంతో కుమిలిపోతున్న మురను
చూసి, ఆమె కోసం ఏకాదశి అనే తిధిని ఏర్పరచారు. విష్ణుమూర్తి మెరపై విజయం సాదించింది
ఈరోజునే! ఈ రోజున ఎవరైతే ఉపవాసం. జగరముంది విష్ణు నమ స్మరణతో కాలం గడుపుతారో వారు
మరణాంతరం వైకుంఠనికి చేరుకుంటారని వరం ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి ! అదీ ఏకాదశి
గాధ!
భారతదేశంలో
శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు 21 రోజుగా భావిస్తారో విష్ణుమూర్తి భక్తులు
ముక్కోటి ఏకాదశిని అంత పవిత్ర దినంగా భావిస్తారు. ఈరోజు విష్ణుమూర్తి పటానికి పండ్లు,
తులసి మాలలు, తమలపాకులు, వక్కపలుకులు, ఆకుపచ్చని ఆరటికాయలు, కొబ్బరికాయలు
సమర్పించి పూజించాలని పురాణాలూ చెప్తున్నాయి.
ముక్కోటి ఏకాదశి ఎలా
పాటించాలి?
ముక్కోటి ఏకాదశి
ఉదయాన్నే లేచి, తలంటు స్నానం చేసి, ఇంట్లో విష్ణుమూర్తి పటం ఎదుటదీపారాధన చేసి,
పైన చెప్పిన విధంగా తులసి మాలలు, ఆరటి ఆకులు సమర్పించి పూజించాలని, ఏదైనా
దేవాలయానికి వెళ్లి, విష్ణుమూర్తి అవతార విశేషాలని అర్చించాలి సాయంత్రం కూడా ఉదయం
వాలే పూజలు చేయాలి. ఆరోజు పూర్తిగా ఉపవాసం. ఉండి జాగరణ చేయాలి
0 Comments